Ramagundam :వారిద్దరి బంధం విడదీయరానిది.
By
Rathnakar Darshanala
వారిద్దరి బంధం విడదీయరానిది.
జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి :
రామగుండం నియోజకవర్గంలో ఒకనాడు ఒక వెలుగు వెలిగిన ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించిన,
కొంకటి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి సంఘము నుంచి అనేక పదవులు పొందిన అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఇద్దరి అభినవ సంబంధం విడదీయరాన్ని బంధంగా మారింది అని అనడంలో ఆశ్చర్యం లేదు,
వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఇద్దరు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా మీదిలేవారు ఎక్కడ ఉన్న వారిద్దరు ఒకటే అనే విధిగా మెదలారు.
ఆయన జడ్పీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఈయన మేయర్ గా పనిచేసినప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఎలాంటి కల్మషం లేకుండా అదే ఫ్రెండ్షిప్ కొనసాగించారు,
బారాసకు మేయర్ గా పనిచేసిన కొంకటి లక్ష్మీనారాయణకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత బారాస అధ్యక్షులు కేసిఆర్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర తెలంగాణ స్టేట్ కి సభ్యులుగా అయ్యారు,
ఆయన పదవికి న్యాయం చేస్తూ రామగుండంలో మేయర్గా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ప్రస్తుత పదవికి కూడా న్యాయం చేస్తూ ముందుకు పోతున్నారు,
ఈ తరుణంలో ఆయన ఆత్మీయుడు ఇద్దరు అభినవ సంబంధం కలిగిన వ్యక్తులు అయిన అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఒకనాడు వాళ్ల తండ్రి ఐఎన్టీయూసీలో కీలకపాత్ర వహించడం కాకుండా ఆనాడుకేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామికి అతి సన్నితుడిగా లక్ష్మణ్ కుమార్ తండ్రి నాగయ్య ఐఎన్టియుసి లో కీలక పాత్ర వహించారు,
ఆయన చూపిన ధర్మం ఆయన చేసిన ఆదర్శం లక్ష్మణ్ కుమార్ ను 1984కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కీలక పాత్ర వహించారు.
1984లో స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఆగలేదు కార్యకర్తగా ఎన్ఎస్ఐ నాయకునిగా యువజన కాంగ్రెస్ నేతగా అనేక పదవులు పొందడమే కాకుండా జడ్పీ చైర్మన్గా ఎన్నికైన కాకుండా ఆయన ధర్మపురి మీద పెట్టుకున్న ఆశలను అడియాశలు అయినప్పటికీ ధర్మపురిలో ఎమ్మెల్యేగా గెలవాలి అనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి గత ఎన్నికల్లో ఫలించింది,
అంతకుముందు ఎన్నికల్లో సైతం ఆయనే గెలుపొందినప్పటికీ అప్పుడున్న అధికార పార్టీ అటూ ఇటూ చేసి గెలుపునిందనే వార్తలు వెలుగురించాయి.
కోర్టులో సైతం లక్ష్మణ్ కుమార్ నెగ్గారు, అయినా అప్పుడున్న ప్రభుత్వం నియంత పోకడలతో కోర్టులో నెగినప్పటికీ లక్ష్మణ్ కుమార్ కి చుక్క ఎదురయింది,
కానీ గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందడం కాకుండా ఆయన చేసిన పార్టీ సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది.
ఇవ్వడమే కాకుండా ఆయనకు వికలాంగుల శాఖ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖతో పాటు మైనార్టీ శాఖను కేటాయించింది.
ఏది ఏమైనా కొంకాటి లక్ష్మీనారాయణ రామగుండంలో మేయర్ నాడు ఆయన లక్ష్మణ్ కుమార్ జడ్పీ చైర్మన్ ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్లది విడదీయరాని బంధం అని చెప్పవచ్చు,
ప్రస్తుతం సైతం ఆయన కేటాయించిన శాఖ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ వికలాంగుల శాఖ మైనార్టీ శాఖ కావడంతో అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొంకాటి లక్ష్మీనారాయణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నారు.
అది నిజం ఏదిఏమైనా అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కొంకటిలక్ష్మీనారాయణ ది విడదీయరాన్ని బంధం అని చెప్పవచ్చు.
Comments