పాము కాటుతో వ్యక్తి మృతి.
By
Rathnakar Darshanala
పాము కాటుతో వ్యక్తి మృతి.
నేటివార్త,మే 24,తాండూర్:
తాండూర్ మండలంలోని రెపాల్లివాడ గ్రామంలో భీష్ణు ప్రసాద్ (52) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన భీష్ణు ప్రసాద్ అనే వ్యక్తి తాండూర్ మండలం రెపాల్లివాడ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు.శుక్రవారం రోజున.
రోజు లాగానే కూలీ పనికి వేళ్ళి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి తలుపులు తెరిచి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని పాము కాటు వేసింది.
శనివారం తెల్లవారుజామున చూట్టూ పక్కల వారు తలుపులు తెరిచి ఉండడంతో ఇంట్లో కెళ్ళి చూసేసరికి కాలుకు రక్తం కనిపించడంతో పాటు కాటుతో మృతి చెందినట్లు వారు గురించారు.
వేంటనే తాండూర్ పోలిస్టేషన్ కు సమాచారం అందిచడంతో ఎస్ఐ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు.
మృతుని సోదరుడు వర్కడే మాన్ సింగ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments