ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి.జగిత్యాల ఎమ్మెల్యే.

Rathnakar Darshanala
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి.జగిత్యాల ఎమ్మెల్యే.
 
–జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

నేటివార్త రాయికల్,మే 24: ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.

రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాయికల్ మండల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఐదు రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “విద్యార్థుల నైపుణ్యానికి అనుగుణంగా బోధన జరగాలని,ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి,ఉన్నత లక్ష్యాలు నిర్దేశించి తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని, 

బీద,మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల స్థాయిలోనే బోధన అందించాలని పేర్కొన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడు నూతన సాంకేతికత నేర్చుకొని బోధనలో వినియోగించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.సత్య సాయి ట్రస్ట్, ప్రభుత్వ సహకారంతో పిల్లలకు రాగి జావ అందించాలని ఎమ్మెల్యే కోరారు.పాఠశాలలు స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

గురువులు విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి  నిబద్ధతతో పనిచేస్తున్నారని, 

అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు,జిల్లా విద్యాధికారి రాములు నాయక్, 

ఎంఈఓ రాఘవులు, మాజీ ఏఎంసి ఛైర్మన్ గన్నే రాజిరెడ్డి,మాజీ సర్పంచ్ రాజేశం,అచ్యుతరావు, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్,రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహేందర్ బాబు, చంద్రతేజ్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments