బెంగాల్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.
By
Rathnakar Darshanala
బెంగాల్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.
*విశ్వహిందూ పరిషత్ నాయకుల డిమాండ్*
నేటివార్త జగిత్యాల బ్యూరో ఏప్రిల్ 19 :
తెలంగాణ రాష్ట్ర పిలుపుమేరకు బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ బెంగాల్ హిందువులకు రక్షణ కల్పించాలని జగిత్యాల విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు.
శనివారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్కడున్నటువంటి ప్రభుత్వం రక్షణలో పూర్తిగా విఫలం అయిందని హిందువులపై దాడులు జరుగుతున్న,
అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల ఎందరో హిందువులు అన్యాయంగా హింసాత్మక దాడులు మహిళలపై హత్యాచారాలు మరణాలు గాయల పాలవుతున్నారని వివరించారు.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుండి సాధారణ స్థాయి రావాలంటే రాష్ట్రపతి పాలన అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోయిన పద్మాకర్ రావు జిల్లా కోశాధికారి మామిడాల రాములు జిల్లా సహకార్య దర్శి గాజోజు సంతోష్ జగిత్యాల నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్,
నగర కార్యదర్శి ఎదురుగట్ల పరందం భాజరంగ్ దళ్ టౌన్ కన్వీనర్ పాదం మహేందర్ చిట్ల రాజేంధర్ ప్రసాద్ వేముల సంతోష్ గంగాధర్ వీరబత్తిని అనిల్ దుర్గం కృష్ణ సాయి వికాస్ తదితరులు పాల్గొన్నారు
Comments