ఇసుక సూరులకు...మరో ప్రాణం బలి..!

Rathnakar Darshanala
ఇసుక సూరులకు...మరో ప్రాణం బలి..!
కోటపల్లి నేటి వార్త ప్రతినిధి.

* ఇసుకాసూరులకు మరో ప్రాణం బలి.!
* ప్రభుత్వాలు మారిన  చేతివాటం మారలే..!!
*  అధికారులు ఎప్పుడూ ప్రభుత్వానికి సొత్తులేనా.!!!
*  కానరాని ప్రభుత్వ  నిబంధనలు.?
* కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి.!

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య చిన్న కుమారుడు పారుపల్లి తీరంలో తన పుట్టినరోజు సందర్భంగా స్నానానికి వెళ్లి  గ్రామ సమీపంలో  నది లో పడి ప్రాణాలు విడిచాడు.

వివరాల్లోకి వెళితే పారుపల్లి. గ్రామంలో శంకరయ్య సావిత్రి కుమారుల్లో  చిన్న కుమారుడు అశోక్ 
 పుట్టినరోజు సందర్భంగా పారు పెల్లి   సమీపంలో ఉన్న నది తీరంలో స్నానానికి వెళ్లి ఇసుక క్వారీ త్రవ్విన గుంత లో పడి ప్రాణాలు విడిచాడు.

ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే
నది తీరంలో గత కొన్ని సంవత్సరాలు తరబడి ప్రభుత్వపరమైన ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయి కానీ నిబంధనల ప్రకారం తవ్వకాలు జరగడంలేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నది తీరంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అవి ప్రభుత్వ పరమైన నిబంధనలకు విరుద్ధమే అని ప్రజలు ఆరోపిస్తున్నారు.

 ఇసుక గుంతలు తవ్విన తర్వాత తగిన నిబంధనలు పాటించి హెచ్చరిక జాలి చేసే బాధ్యత ఆ కాంట్రాక్టర్ ది అదేవిధంగా నేషనల్ హైవే రోడ్డు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇసుక క్వారీలకు అచ్చే వాహనాలను నిలిపివేయడం కూడా ముమ్మాటికి కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్యానికి కారణమే అని ప్రజలు భావిస్తున్నారు.

 ఇకనైనా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మాత్రం ఉంది అని ప్రజలు భావిస్తున్నారు.
Comments