జర్నలిస్టుల ఐక్యతకు కొత్త కమిటీ రూపుదిద్దుకుంది.
By
Rathnakar Darshanala
జర్నలిస్టుల ఐక్యతకు కొత్త కమిటీ రూపుదిద్దుకుంది.
నేటి వార్త, రామకృష్ణాపూర్ :
ప్రెస్ క్లబ్ క్యాతన్ పల్లి నూతన కమిటీనీ ఎన్నుకున్నట్లు ఆ కమిటీ గౌరవ అధ్యక్షుడు పిలుమాల్ల గట్టయ్య తెలిపారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆరంధ స్వామి, ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు, కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి అరెల్లి గోపికృష్ణ, కార్యనిర్వాహణ అధ్యక్షుడు గంగారపు గౌతమ్ కుమార్,
ఉపాధ్యక్షులు మారపల్లి వేణుగోపాల్ రెడ్డి, కొండ శ్రీనివాస్, నాంపల్లి గట్టయ్య, కార్యనిర్వహక కార్యదర్శి పొనగంటి దుర్గా రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శులు నెల్లూరి శ్రీనాథ్,
పురుషోత్తం గంగులు యాదవ్ లు ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా దాసరి స్వామి, కొమ్మ సదానందం, దుర్గం వెంకటస్వామి, మాషపత్రి ప్రవీణ్, మోరే రవీందర్ లు ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షులు గట్టయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్, అధ్యక్షులు ఆరంద స్వామి మాట్లాడుతూ ప్రతి వర్కింగ్ జర్నలిస్టు ఐక్యతతో ఉండాలని, ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, పలు యూనియన్ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.
Comments