adilabad :టీయూడబ్ల్యూజే తరఫున కలెక్టర్కు సన్మానం..
By
Rathnakar Darshanala
టీయూడబ్ల్యూజే తరఫున కలెక్టర్కు సన్మానం..
నేటి వార్త ఆదిలాబాద్ :
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (tuwj 143) యూనియన్ తరపున జిల్లా కలెక్టర్ రాజార్షి షా ను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
నార్నూర్ మండలంలో నీతి ఆయోగ్ ప్రమాణికల మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధించి జాతీయస్థాయిలో మండలం ఐదవ ర్యాంక్ లో నిలబడడం ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణమని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బేత రమేష్ అన్నారు.
సంక్షేమం అభివృద్ధి ఫలాలతో వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకు వెళ్తున్న కలెక్టర్ ను అభినందించారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఆస్పిరియల్ అవార్డును పొందిన కలెక్టర్ ను పూల బోకే తోపాటు శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం కేక్ కట్ చేసి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈనాడు ఈటీవి సీనియర్ జర్నలిస్ట్ మనికేశ్వర్, జర్నలిస్టు సంఘం నాయకులు ఎంఏ అన్వర్, సంతోష్, సుభాష్, రత్నాకర్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, షాహిద్, ఖాన్, కిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments