బరి తెగిస్తున్న లోన్ యాప్ లు...బలైతున్న యువత.

Rathnakar Darshanala
బరి తెగిస్తున్న లోన్ యాప్ లు...బలైతున్న యువత.

ఫైట్ ఫర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్.

(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి) రామగుండం నియోజకవర్గం ఏప్రిల్ 21 :

క్షణాల్లో రుణాలిస్తామంటూ అప్పుల ఊబిలోకి దింపి, రుణగ్రహీతల మానప్రాణాలతో చెలగాటమాడుతూ, అమాయకులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆన్లైన్ రుణ యాప్లపై తక్షణమే నిషేధం విధించి, వాటి నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు *మద్దెల దినేష్*  డిమాండ్ చేశారు.

అనంతరం  *మద్దెల దినేష్* మాట్లాడుతూ ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో యువత జల్సాలకు అలవాటు పడి కొందరు, మరి కొందరు కుటుంబ అవసరాల నిమిత్తం మరి కొందరు ఇలా వివిధ రకాలుగా వివిధ ఆన్లైన్ యాప్ లలో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక కొంతమంది, 

చెల్లించి కొంతమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
    
అవసరాల నిమిత్తం  కొందరు అనేక రకాల ఆన్లైన్ యాప్ ల ద్వారా వారికి వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న అప్పును తీర్చలేక వారు పెట్టే టార్చర్ భరించలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చూస్తున్నామన్నారు.
    
ఆన్లైన్లో నుంచి రుణాలు అందించే వారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని,  ఇటీవల కాలంలోని దేశంలో వివిధ రాష్ట్రాలలో యాప్ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించే క్రమంలో సంబంధిత యాప్ల యాజమాన్యాలు వారు చేసే వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు చాలా జరుగుతున్నాయని,  

ఇందులో అత్యాఅధిక శాతం యువతే ఇంకా మధ్య తరగతి ప్రజలు ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.
   
  అయితే ఆర్బిఐ చట్టం ప్రకారం 1934 లోని సెక్షన్ 45-1 ప్రకారం ఎన్బీఎఫ్ లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధన మేరకు పనిచేయడానికి అనుమతి ఉంటుంది రిజిస్టర్ కానీ ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చట్టబద్ధత ఉండదు. 

అలాంటి వాటి మీద పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చన్నారు.
   
  ప్రస్తుతం చాలామంది  ఈ ఆన్లైన్ యాప్లు అధిక శాతం ఆర్బిఐ లో నమోదు కానివి ఉన్నాయని వారికి రుణాలు అందించే అధికారం లేనప్పటికీని విషయం తెలవక చాలామంది  బాధితులు అలాంటి యాప్స్ లో లోన్లు తీసుకొని మోసపోతున్నారన్నారు.
    
 ఈ యాప్ లో అధికంగా చైనీస్ యాప్లే ఉన్నాయి. వాటిని రిజిస్టర్ అయిన చిరునామా గాని సరైన మొబైల్ నెంబరు గాని ఇవ్వరు, వివరాలు ఉండవు, ఫోన్ ద్వారానే సమాచారాన్ని డేటాను మ్యాప్ నిర్వాహకులు తెలుసుకుంటారు.
   
 ఈ యాప్లు యూజర్లు ఇచ్చిననాపూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో, సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు.
    
 యాప్ ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్ల నిర్వహకులు దుర్వినియోగం చేస్తారు అన్నారు.
   
 యాప్ రుణాల మోసపూరితంగా ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏ విధమైన షరతులు అంగీకరించకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఇట్టి పరిస్థితుల్లో అందజేయకూడదు ఇంటర్నెట్లో లభించే పలు రుణాలు అందించే యాప్లు మోసపూరితమైనవి ఆర్బిఐ గుర్తింపు లేని యాప్ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోకూడదు 

ఈ యాప్ ద్వారా అందించే రుణాలు వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులకు లేదా ఎన్ ఎఫ్ బి సి రిజిస్టర్ అయిన సంస్థలను ఇచ్చే రుణం వడ్డీల కన్నా అదికంగా ఉంటాయి, రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడు అంతలై రుణ వలయంలో చెప్పుకుంటారు 

దీంతో రుణాలు చెల్లించని రుణ గ్రహతలు తిరిగి చెల్లించమని బెదిరించడం మీ వ్యక్తిగత ఫోటోలు మీ కాంటాక్ట్ లో ఉన్నవాళ్ళకి పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడంలో పాటు ఆన్లైన్ వేధింపులు ఈ యాప్ ద్వారా నిర్వాహకుడు పాల్పడుతూ ఉంటారు, 

రుణాలను చెల్లించనట్లయితే  క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని రుణమాన్నించే యాప్లు బెదిరించే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సంబంధిత బాధితులు వెంటనే సైబర్ క్రైమ్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంటుంది ఇంకా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి ఇలాంటి లోన్ యాప్ పట్ల అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన సైబర్ క్రైమ్ పోలీసుల పైన ఉందని అన్నారు.
   
 లోన్ రికవరీ ఏజెంట్ మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, పరిస్థితిని నిర్వహించడానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్, 1860, సెక్షన్ 506 (నేరమైన బెదిరింపులకు సంబంధించి), డిఫాల్టర్ రికవరీ ఏజెంట్ మరియు రికవరీ ఆఫీస్‌కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి అనుమతిస్తుందన్నారు.
    
 కావున అనిలైన్ లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకుని ఇబ్బంది పడి ఇప్పటికే తెలంగాణలో పలువురు ఆత్మ హత్యలు పల్పడం బాధాకరం ఇప్పటికే గోదావరిఖనిలో లోనే ముగ్గురు నలుగురు వీటి బారిన పడి ఆత్మహత్యలు పాల్పడటం దురదృష్టకరం అని ఇలాంటి వాటి జోలికి పోకుండా ఉండాలని దినేష్ ప్రజలకు యువతకు సూచించారు.
Comments