పిట్లం కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ దుర్మరణం.

Rathnakar Darshanala
పిట్లం కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ దుర్మరణం.

*నేటి వార్త పిట్లం మండలం 18 ఏప్రిల్*

పిట్లం పిఎస్ నందు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కే బుచ్చయ్య చారి  తేదీ 17 .04 .2025 నాడు తన విధులు ముగించుకుని,

పిట్లం నుండి బాన్సువాడ వెళుతుండగా రాత్రి దాదాపు 11 గంటల సమయంలో సిద్దాపూర్ గ్రామ శివారులో చెరువు కట్ట వద్ద రోడ్డు పక్కన గల ఈత చెట్టుకు తన ద్విచక్ర వాహనం తాకడం తో చాతికి తలకు బలమైన గాయాలు అయి అక్కడికక్కడే మరణించారు.
 ఇట్టి విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించాము  అని సబ్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు..
Comments