భూసేకరణ సర్వే కు వెళ్లిన సింగరేణి అధికారి పై దాడి.

Rathnakar Darshanala
భూసేకరణ సర్వే కు వెళ్లిన సింగరేణి అధికారి పై దాడి.
నేటి వార్త విలేకారి కపర్తి అభిలాష్(రామగిరి) 

సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా పరిధిలోని ఓసీపీ-2 ఉపరితల గని విస్తరణలో భాగంగా 88 ఎకరాల భూమిని సేకరించడం కోసం గురువారం బుధవారం పేట లో నిర్వహిస్తున్న భూ సర్వేను రైతులు కాని వ్యక్తులు అడ్డుకొని సర్వే పరికరాలు ధ్వంసం చేసారు. 

ఆ సమయంలో అడ్డుగా వెళ్లిన సింగరేణి అడిషనల్ మేనేజర్ కోల శ్రీనివాస్ పై పలువురు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో గాయపడి కోలా శ్రీనివాసును సెంటినరీ కాలనీ డిస్పెన్సరీ కి చికిత్స నిమిత్తం తరలించారు.

 చికిత్స పొందుతున్న కోల శ్రీనివాస్ ను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు పరామర్శించారు. 

మెరుగైన చికిత్స కోసం అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. 

మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి పంపించడం జరిగిందని వైద్యులు తెలిపారు. 

దాడి చేసిన నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఓసీపీ-2 ప్రాజెక్టు ఆఫీసర్ చిట్టా. వెంకటరమణ, 

మేనేజర్ కె.వి.రామారావు, ఎస్టేట్ ఆఫీసర్ కనవేన ఐలయ్య, అధికార ప్రతినిధి బి సుదర్శనం, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్  శబురుద్దీన్ అబ్దుల్ లు ఆయనను పరామర్శించారు.

ఏరియా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ సంఘటనను ఖండించారు.
Comments