మొక్కజొన్న కంకికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.

Rathnakar Darshanala
మొక్కజొన్న కంకికి నిప్పంటించి రూ.2 లక్షల నష్టం.
నేటివార్త రాయికల్ ఏప్రిల్ 17:

రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు గడ్డం దీపక్ రెడ్డి మొక్కజొన్న కంకిని గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. 

ఈ ఘటనలో సుమారుగా రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 

తన కష్టార్జిత పంటను నాశనం చేసిన ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.
Comments