రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు.
By
Rathnakar Darshanala
రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 17 ఆడిచర్ల రమేష్
పెద్దపల్లి మండలంలో గురువారం రోజున రోడ్డు ప్రమాదం జరిగినది. అప్పన్నపేట అందుగులపల్లి మధ్య రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనగా ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
అందుగులపల్లి వద్ద రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతున్నందున వన్ వే ఏర్పాటు చేశారు.ఎదురుగా వస్తున్న బస్సును లారీ ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు.
దీంతో ప్రయాణికులను చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.ఈ విషయము తెలిసిన వెంటనే గాయపడ్డ వారిని పరామర్శించిన ఏసిపి జి.కృష్ణ తోపాటు ఎస్.ఐ.లు సిబ్బంది ఉన్నారు.
Comments