కన్నుల పండుగగా ప్రారంభమైన సీతారాముల కల్యాణ వేడుకలు.

Rathnakar Darshanala
కన్నుల పండుగగా ప్రారంభమైన సీతారాముల కల్యాణ వేడుకలు.
 నేటి వార్త,ఏప్రిల్ 6 లక్ష్మణచాంద :

 లక్ష్మణచాంద మండలం చామన్ పెల్లి గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి.

ఉదయం ఐదు గంటలకు సుప్రభాత కార్యక్రమంతో ప్రారంభమైన వేడుకలకు పెద్ద ఎత్తున గ్రామ మహిళలు మంగళహారతులతో రామాలయానికి చేరుకొని పూజలో పాల్గొన్నారు. 

కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ, వీడీసీ సభ్యులు కోరారు
Comments