పెళ్లి ఒత్తిడితో ప్రేమికుడు ఉరి.
By
Rathnakar Darshanala
పెళ్లి ఒత్తిడితో ప్రేమికుడు ఉరి.
నేటి వార్త రామకృష్ణాపూర్: ప్రేమ వ్యవహారంలో మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్‌లో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, అబ్రహం నగర్‌కు చెందిన బొమ్మన వినయ్ (20), విద్యార్థి, చిన్నప్పటి నుండే తన తాత ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు.
ఇటీవల ఓ యువతిని ప్రేమిస్తున్నానని తన తల్లికి తెలిపాడు. అయితే తల్లిదండ్రులు ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసుకోవాలని సూచించారు.
కానీ ప్రియురాలు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో, ఉద్యోగం లేకపోవడం, భవిష్యత్తుపై ఆందోళనతో మానసికంగా కుంగిపోయిన వినయ్ తన తాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై మృతుడి తల్లి బొమ్మన సంతోషిని ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments