Adilabad :బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం స్పూర్తి దాయకం.తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

Rathnakar Darshanala
Adilabad :బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం స్పూర్తి దాయకం.

 దళిత సమాజాభివృద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవి.. 

- తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త:
అట్టడుగు వర్గాల అభ్యున్నతి ,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన,

 మన భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలు యావత్ భారత జాతి ఎన్నడూ మరిచిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు మహోన్నత వ్యక్తిత్వం కలిగినవారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావులు, 

గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని గుర్తుచేశారు. పరిపాలన నిపుణుడు అయిన ఆయన, జాతీయ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తూ అణగారిన తరగతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించరని అన్నారు.

 వారిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తోందన్నారు. 

కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు రంజిత్, కాంగ్రెస్ సినియర్ నాయకులు నవీన్ రెడ్డి, మాజీ ఎన్‌ఎస్‌యు నాయకులు నరసింహ చారి,మాజీ ఎంపిపి గోవర్ధన్ రెడ్డి, ఫేరోజ్ ,అలీం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Comments