Ap :ఏప్రిల్ 28న జివిఎంసి మేయర్ పదవికి ఎన్నిక.

Rathnakar Darshanala
ఏప్రిల్ 28న జివిఎంసి మేయర్ పదవికి ఎన్నిక.
నోటిఫికేషన్ ను జారీ చేసిన  ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ .

 - విశాఖ జిల్లా కలెక్టర్ ,జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ ఎమ్ ఎన్. హరేందిర ప్రసాద్.

విశాఖపట్నం బ్యూరో,నేటివార్త, ఏప్రిల్ 22:  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ పదవికి ఎన్నికను 2025 ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను జారీ చేశారని విశాఖ జిల్లా కలెక్టర్ , 

జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎమ్ ఎన్. హరేందిర ప్రసాద్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 

సదరు నోటిఫికేషన్ ప్రకారం 24.04.2025 తేదీ లోపల మేయర్ ఎన్నికల షెడ్యూల్ ను ఫారమ్-II ప్రకారం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు ఎన్నికైన సభ్యులకు మరియు ఎక్స్-ఆఫీషియో సభ్యులకు మేయర్ ఎన్నికల నిమిత్తం ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటీసు ఇవ్వడం జరుగునని , 

మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం తేదీ: 28.04.2025, ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగునని కలెక్టర్  తెలిపారు.
Comments