Adilabad :పోలీసుల అనుమతి లేకుండా డీజే లు నిర్వహించరాదు - డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.

Rathnakar Darshanala
Adilabad :పోలీసుల అనుమతి లేకుండా డీజే లు నిర్వహించరాదు - అదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.
 *రాత్రి పది గంటల తర్వాత డీజే, మ్యూజిక్ శబ్దాలకు అనుమతి లేదు.*

 *డీజే ఓనర్స్ తో ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో సమావేశం.*

 *నిబంధనలు ఉల్లంఘించిన డీజే లు సీజ్, వారిపై చర్యలు తప్పవు.*

నేటి వార్త ఆదిలాబాద్ :

సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పట్టణంలో జిల్లాలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజే శబ్దాలకు కానీ మ్యూజిక్ శబ్దాలకు గాని అనుమతులు లేవని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. 

ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో డీజే ఓనర్స్ తో సమావేశం నిర్వహించిన ఆదిలాబాద్ డిఎస్పి మాట్లాడుతూ, ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో డీజే ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. 

సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రెండు బాక్సులకు మించి శబ్దాలను వచ్చే విధంగా డీజే ఏర్పాటు ఉండకూడదని అందులో ఎలాంటి ఊఫర్స్ లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉండరాదని సూచించారు. 

చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోబడుతూ, డీజే సీజ్ చేయబడుతుందని హెచ్చరించారు.

 శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు గుండె సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బందికి సహకరిస్తూ డీజేలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ మరియు ఎస్ఐలు అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments