ఎమ్మెల్యే ప్లెక్సీ చింపిన దుండగులను కఠినంగా శిక్షించాలి.
By
Rathnakar Darshanala
ఎమ్మెల్యే ప్లెక్సీ చింపిన దుండగులను కఠినంగా శిక్షించాలి.
: రాయికల్‌లో ప్రజాప్రతినిధుల ఆగ్రహం.
నేటివార్త రాయికల్ ఏప్రిల్ 21:
రాయికల్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభిమాని మహేందర్ బాబు ఏర్పాటు చేసిన ప్లెక్సీని గుర్తుతెలియని దుండగులు చింపిన ఘటనకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ మేరకు సంఘటనపై బాధితులు రాయికల్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్ సుధీర్ రావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ,ఈ అరాచక చర్యలను ఖండిస్తూ, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కక్షతీర్చుకునే ధోరణితోనే ప్లెక్సీ చింపినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
రాయికల్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని,రాజకీయ సమరసతకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే ప్రతికార చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే మోర హన్మాండ్లు మాట్లాడుతూ, శనివారం రాత్రి 11 గంటల తర్వాత ఎవరో దుండగులు ప్లెక్సీలను చింపారని,అవి ప్రేమతో ఏర్పాటు చేసిన బ్యానర్లు కావడంతో కావాలనే మాయం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
రాయికల్‌లో అన్ని రాజకీయ పార్టీల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యలు శాంతిని భంగం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కోల శ్రీనివాస్ మాట్లాడుతూ,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేక అభివృద్ధి పనులను చేపట్టుతున్నారని, ప్లెక్సీ చింపడం ద్వారా ఎవ్వరూ రాజకీయంగా ఎదగలేరని అన్నారు.
ప్రజల మద్దతుతోనే నాయకులుగా గుర్తింపు వస్తుందని,దుండగులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మహేందర్ బాబు,గన్నే రాజారెడ్డి, రవీందర్ రెడ్డి,నర్సయ్య, జక్కుల చంద్రశేఖర్,బెజ్జంకి మోహన్,శ్రీనివాస్ గౌడ్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments