Adilabad :నూతన డిఈవోను కలిసి సన్మానించిన.బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
By
Rathnakar Darshanala
Adilabad :నూతన డిఈవోను కలిసి సన్మానించిన.బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త:
జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన ఏనుగు శ్రీనివాస్ రెడ్డి గారిని నేడు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు స్వయంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న అంశాన్ని శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల మౌలిక వసతులపై మరింత శ్రద్ధ చూపించాలని కోరారు. కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు రంజిత్, కాంగ్రెస్ సినియర్ నాయకులు నవీన్ రెడ్డి,మాజీ ఎంపిపి గోవర్ధన్ రెడ్డి,అలీం, తదితరులు పాల్గొన్నారు.
Comments