Adb:ఘనంగా మాజీ మంత్రి సిఅర్ అర్ జన్మదిన వేడుకలు.నివాళులు అర్పించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

Rathnakar Darshanala
ఘనంగా మాజీ మంత్రి సిఅర్ అర్ జన్మదిన వేడుకలు.నివాళులు అర్పించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
ఆదిలాబాద్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత సీఆర్ఆర్ 

- తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త:

మాజీ మంత్రివర్యులు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరిచిపోలేని మహానేత దివంగత చిలుకూరి రామచంద్రా రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. 
బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సీఆర్ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం  కేక్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. 
వారు చేసిన సేవలను కొనియాడుతూ జోహార్ సీఆర్ఆర్ అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేసి, తన చివరి క్షణం వరకు ఆదిలాబాద్ ప్రజల బాగోగులకోసమే పనిచేసిన వ్యక్తి సీఆర్ఆర్ గారు అని అన్నారు. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులని క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులను తయారుచేసిన ఆయనకు సదా రుణపడి ఉంటామని అన్నారు. 

తన హయాంలో ఎన్నో సాగునీటి ప్రాజక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఆ మహానేత మనమధ్య లేకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. వారు చూపిన మార్గంలో నడుస్తూ ప్రతీ ఒక్కరు వారి ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, మాజి ఎంపిపి గోవర్ధన,కో ఆప్షన్ మెంబర్ రహీం ఖాన్, మాజీ ఎన్ ఎస్ యు నాయకులు నరసింహా ,సీనియర్ నాయకులు నవీన్ రెడ్డి, 

మహ్మద్ వసీముద్దిన్,మద్దెల శ్రీనివాస్,కుదురుపాక సురేష్,జుబేదా,ఖమర్ బేగం, ప్రేమల, బాలకృష్ణ, ఎస్ కె రహీం,లస్మన్న,ఎండి ఆఫ్సర్,వెంకటేష్, ముర్తుజా,దినేష్,ఆఫ్సర్ ఖాన్,అలీం,సెముల్లాఖాన్ ,అడెల్లు,పెటన్న,మన్సుర్ భాయ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments