మహిళలూ....మహారాణులూ..!
By
Rathnakar Darshanala
మహిళలూ....మహారాణులూ..!
*విధి నిర్వహణలో మీకు మీరే సాటి*
*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*
నేటివార్త మార్చి 8 మంచిర్యాల బ్యూరో :
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా....
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా....అన్నాడు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి.
స్త్రీ కేవలం వంటింట్లో మాత్రమే కాదు తనకు అవకాశం కల్పిస్తే అంతరిక్షంలోకి వెళ్లి వస్తామని నిరూపించింది సునీతా విలియమ్స్.అలాగే కుటుంబంలో స్త్రీ పాత్ర అమోఘం కృష్ణుడు దశావతారాలు ఎత్తినట్లుగా తను కూడా శిశువుగా,కన్యగా,చెల్లిగా,భార్యగా,కోడలిగా,తల్లిగా,ఇలా స్త్రీ పలు రకాల అవతారాలు ఎత్తి మనలో ఒకరిగా ఉంటుంది.
భార్యగా అడుగు పెట్టిన నాటి నుండి తన జీవితాన్నే త్యాగం చేస్తుంది.
*నిర్విరామంగా శ్రమిస్తూ వృత్తినే దైవంగా భావిస్తూ*
*చెన్నూరు మండల వ్యవసాయ అధికారి యామినీ*
తను నూతనంగా కొలువులో చేరినప్పటినుండి రైతుల సంక్షేమం కోసం ప్రతీరోజూ రోజుకో గ్రామం చొప్పున భగభగ మండే ఎండలో కూడా పంటపొలాలను సందర్శిస్తూ రైతు సదస్సులు నిర్వహిస్తూ పంటలలో వచ్చు చీడపీడల నుండి పంటలను రక్షించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్న చెన్నూరు వ్యవసాయ శాఖ అధికారి *యామిని* మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
*అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తూ..మహిళా మణులకు దైర్యాన్నిస్తూ*...
*నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న బీమారం ఎస్సై శ్వేత*
వృత్తిలో భాగంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిజాయితీగా పనిచేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన శ్వేత మేడం అక్రమార్కులను ఆటపట్టిస్తూ,మండలంలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారు.
గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహిస్తూ,మద్యపానం,గంజాయి లాంటి వాటిపై యువత దూరంగా ఉండేటట్లు అవగాహన కల్పిస్తూ నిత్యం ప్రజా సేవకే అంకతమయిన *శ్వేత* మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
*మహిళా దినోత్సవం రోజున విధి నిర్వహణ*
*చెన్నూరు లో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా కానిస్టేబిల్లు*
మహిళా దినోత్సవం రోజున వృత్తిలో భాగంగా చెన్నూరు మహిళా కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తూ తమ వృత్తి ధర్మాన్ని చాటారు. సందర్భం ఏదైనా మా విధులు మాకు ముఖ్యం అంటున్న మహిళా కానిస్టేబుళ్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
--- గజ్జల చంద్రశేఖర్
నేటివార్త బ్యూరో మంచిర్యాల.
Comments