Adilabad :మామ్స్ కిచెన్ కాదు... ప్రాణాలు తీసే కిచెన్.
By
Rathnakar Darshanala
మామ్స్ కిచెన్ కాదు... ప్రాణాలు తీసే కిచెన్.
మున్సిపల్ శాఖ అధికారుల తనిఖీ.
ఆదిలాబాద్ నేటి వార్త:జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో ఉన్న మామ్స్ కిచెన్ పై శుక్రవారం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేంద్రర్ తన సిబ్బంది తో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీ లో భాగంగా కుళ్లిన చేపలు.మటన్ లో పురుగులు,కుళ్లిపోయిన చికెన్ పదార్ధాలను చూసి కంగుతిన్నారు.
హోటల్ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కుళ్లిన చేపలు,మాంసం తో ప్రజల ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కుళ్లిన చేపలపై బొద్దింకలు,పురుగులు ఉండడంతో వెంటనే వాటిని చెత్త బండిలో వేయించారు.
హోటల్ యజమానులు ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలు అమ్మినట్లు తేలిస్తే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
Comments