ప్రెస్ క్లబ్ క్యాతన్ పల్లి కమిటీ రద్దు.
By
Rathnakar Darshanala
ప్రెస్ క్లబ్ క్యాతన్ పల్లి కమిటీ రద్దు.
- అడ్ హక్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
నేటి వార్త, రామకృష్ణాపూర్ : ప్రెస్ క్లబ్ క్యాతన్ పల్లి కమిటీ కాలపరిమితి ముగియడంతో కమిటీని రద్దు చేస్తున్నట్లు ముఖ్య సలహాదారు ఈదునూరి సారంగరావు ప్రకటించారు.
గత సంవత్సరం పాటు కమిటీని సమర్థంగా నడిపించిన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులను సభ్యుల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.
కమిటీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పిఎస్టీలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం,
నూతన కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈదునూరి సారంగరావు ఆధ్వర్యంలో అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో కన్వీనర్ ఈదునూరి సారంగరావు,
సభ్యులు,అరేల్లి గోపికృష్ణ, నాంపల్లి గట్టయ్య, బండ అమర్నాథ్ రెడ్డి, ఎన్. శ్రీనాథ్
నూతన కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈ కమిటీ ప్రెస్ క్లబ్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుందని, అందరూ సహకరించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Comments