ఆస్నాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పోగ్రాం.

Rathnakar Darshanala
ఆస్నాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పోగ్రాం.
*యువత మత్తుపదార్తాలకు బానిస కావద్దు*

*చెన్నూరు పట్టణ సీఐ రవీందర్*

నేటివార్త మార్చి 7 చెన్నూరు:

యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెన్నూరు పట్టణ సీఐ రవిందర్ యువతను ఉద్దేశించి మాట్లాడారు.

చెన్నూరు మండలంలోని ఆస్నాద్ గ్రామంలో శుక్రవారం రోజున సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించిన ఆయన త్రాగి వాహనాలు నడిపిన వారిని బ్రీత్ టెస్ట్ నిర్వహించి సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ యువత త్రాగి వాహనాలు నడపకూడదని,

గంజాయి,సిగరెట్,ఆల్కహాల్ వంటి మత్తుపదార్తాలకు దూరంగా ఉండాలని,మంచి చదువులు చదివి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని మీ తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు సుబ్బారావు,వెంకటేశ్వర్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments