ఎండాకాలం దొంగల కాలంప్రజలు అప్రమతంగా ఉండాలి.నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్.
By
Rathnakar Darshanala
ఎండాకాలం దొంగల కాలం.నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్.
*నేటివార్త
*--అగ్ని ప్రమాదాలు... దొంగల పట్ల జాగ్రత్త*
*--సమ్మర్ స్నాచర్లు...చెడ్డి గ్యాంగ్ దొంగల కాలం ప్రజలు జాగ్రత్త*
*--నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్*
*నేటివార్త మార్చి 21( నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి బి. మల్లేష్)*
ఒకపక్క ఎండాకాలం మరోపక్క దొంగల కాలం ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు,
ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్టణ ప్రాంతాలతో సహితం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను సమ్మర్ స్నాచర్లు, చెడ్డి గ్యాంగ్, చిల్లర దొంగలు, రంగ ప్రవేశం చేస్తూ బయట నిద్రిస్తున్న మహిళల గొంతులో ఉన్న ఆభరణాలు,
ఇతర విలువైన వస్తువులను దోచుకుపోయే ప్రమాదం ఉందని ఇతర రాష్ట్రాల నుంచి ఈ వేసవికాలంలో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు తగిన జాగ్రత్తలతో పాటు కట్టుదిట్టమైన నిఘాతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు,
ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురికాకుండా ఆపదలో ఉన్న మహిళలు తో సైతం ప్రతి ఒక్కరు వస్తే 100 ఫోన్ చేయగలరని వెంటనే బ్లూ కోర్ట్ పోలీసులు రంగ ప్రవేశంలోకి దిగి దొంగలను పట్టుకొని కటకటాల పాలు చేస్తామని ఆయన వివరించారు,
అంతేకాక ఎండాకాలం దొంగలకు మంచి కాలంగా భావిస్తూ గ్రామాలలో తీవ్రమైన ఉక్కుపోతతో ఈ వేసవికాలంలో చల్లటి గాలి కొరకు బయట నిద్రించడానికి ఎక్కువ ఇష్టపడతారని అందువల్ల
దొంగలు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల పై దృష్టి పెడతారని అందుకే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు,
ఎండాకాలంలో గొలుసు దొంగతనాలతో పాటు స్నాచింగ్ చెడ్డి గ్యాంగ్ దొంగల కు ఈ ఎండాకాలం ఎంతో సులభంగా ఉంటుందని అందుకే ఎండాకాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతాయని వీటిపై ప్రతి ఒక్కరు అవగాహన పొందాలని ఆయన చూపించారు,
అంతేకాక చెడ్డి గ్యాంగ్ ఒంటిపైన బట్టలు లేకుండా కేవలం చెడ్డితో శరీరం మొత్తం నూనె పూసుకుని తిరుగుతుంటారని పట్టుకున్న సందర్భంలో జారిపోవడానికి నూనె ఎంతో మేలు చేస్తుందని అందుకే చెడ్డి గ్యాంగ్ శరీరం మొత్తం నూనె పూసుకుని చెడ్డీ వేసుకొని తిరుగుతుంటారని అలాంటి వ్యక్తులను గమనించాలని డిఎస్పి శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు,
అంతేకాక ఒంటిపైన బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు పెట్టుకోకుండా రాత్రి వేళలో తగిన జాగ్రత్త పాటించాలని చైన్ స్నాచింగ్ దొంగలు మెడలో ఉన్న గొలుసులు తెంపుకొని పరారవుతారని వెనక ముందు చూసుకొని వెళ్లాలని అంతే కదా చిల్లర దొంగలు పట్టపగలు వివిధ రూపాలలో వివిధ వస్తువులు అమ్ముకోవడానికి వచ్చినట్లు చీరలు ,బట్టలు, గిఫ్ట్ ఆర్టికల్స్, పేరుతో వ్యాపారానికి వచ్చి ఇండ్లు రెక్కి నిర్వహించి దోపిడి దొంగతనాలకు పాల్పడతారని అలాంటి వ్యాపారస్తుల పైన కూడా ప్రజలు నిఘా పెట్టాలని ఆయన సూచించారు,
రూటు మార్చి దొంగలు ఒకరోజు పట్టణ ప్రాంతాల్లో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడతారని సాధారణంగా ఎండాకాలంలో ఈ దొంగతనాల పై దొంగలు ఎక్కువ ఫోకస్ చేస్తారని అన్నారు,
అంతేకాక వేసవికాలంలో సెలవులు వస్తే చాలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో తమ తమ పూర్వీకుల దగ్గరకు సొంత గ్రామాలకు తరలిపోతారని అలాంటి సందర్భంలో పట్టణ ప్రాంతాల్లోని ఇండ్లు పక్క ఇంటి వారికి చెప్పి వెళ్లిపోవాలని డి.ఎస్.పి ప్రజలకు విజ్ఞప్తి చేశారు,
వీటితోపాటు మండుతున్న ఎండలతో గ్రామీణ ప్రాంతాలతో సైతం ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అగ్ని ప్రమాదాలపై కూడా ప్రజలు దృష్టి కేంద్రీకరించి అగ్ని ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు,
Comments