ఏసీబీ వలలో అవినీతి రక్షణ చేప

Rathnakar Darshanala
ఏసీబీ వలలో అవినీతి రక్షణ చేప 

 రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్.

 నేటి వార్త మార్చి 25 స్టేట్ బ్యూరో 

_కాకినాడ జిల్లా: పిఠాపురం._ రూరల్ పరిధిలో రూ 20,000 లంచం తీసుకుంటూ ఓ అవినీతి రక్షణ చేప ఏసీబీకి దొరికిపోయింది _రూ.20,000/-  లంచం తీసుకుంటూ పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ ఏసీబీకి చిక్కడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

 వివరాల్లోకి వెళితే పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారి నుండి (ఎస్సీ ఎస్టీ కేసు నుండి ఉన్నతాధికారులు  ఆదేశాల మేరకు పేర్లను తొలగించేందుకు) రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు.

 వారి డిమాండ్ మేరకు కిల్లాడి దుర్గాప్రసాద్ సానబోయిన గంగరాజు లంచం ఇస్తామని ఒప్పుకొని డబ్బులు చెల్లించుకుని ఆర్థిక స్తోమత లేక చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ అధికారులు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని  ఎట్టకేలకు లంచం డిమాండ్ చేసిన పిఠాపురం రూరల్ ఎస్సై ఎల్.గుణశేఖర్, అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఎసిబి అధికారులకు చిక్కారు. 

అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎసిబి సిబ్బంది పక్కా సమాచారంతో దాడిచేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. 

జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు.._
Comments