సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా...ఐదుగురు మహిళల అరెస్టు.
By
Rathnakar Darshanala
సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా...ఐదుగురు మహిళల అరెస్టు.
నేటి వార్త,రామకృష్ణాపూర్: ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు మహిళలను గురువారం రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని కొందరు తక్కువ ధరకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలో అధిక ధరకు అమ్ముతున్నట్టు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, పోలీసులు దాడి చేసి 40 బస్తాలు (8 క్వింటాళ్లు) బియ్యం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 2,800 గా అంచనా.
పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ కు అప్పగించినట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Comments