గ్రూప్ పరీక్షల్లో సత్తా చాటిన పెద్దపల్లి యువతి.
By
Rathnakar Darshanala
గ్రూప్ పరీక్షల్లో సత్తా చాటిన పెద్దపల్లి యువతి.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 08 అడిచెర్ల రమేష్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెలువరించిన ఫలితాల్లో పెద్దపల్లి మండలం పెద్దబొంకూరుకు చెందిన పాంచాల వెంకటేశ్వర్లు-వసంత దంపతుల కుమార్తె పాంచాల మౌనిక పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించింది.
పెద్దబొంకూరు జడ్పీహెచ్ఎస్ లో పదవతరగతి వరకు చదువుకున్న మౌనిక నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా పూర్తిచేసి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీటెక్, జేఎన్టీయుహెచ్ లో ఎంటెక్ పట్టా పొందింది.
గ్రూప్-4 ఉద్యోగాలకు కూడా మౌనిక ఎంపికై తన ప్రతిభను చాటింది. గ్రూప్-1 ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు, బంధువులు హర్ష వ్యక్తం చేసి మౌనికకు అభినందనలు తెలిపారు.
Comments