గ్రూప్ 3 ఫలితాల్లో సత్తా చాటిన యువకుడు.
By
Rathnakar Darshanala
గ్రూప్ 3 ఫలితాల్లో సత్తా చాటిన యువకుడు.
నేటివార్త మార్చి 14 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:
రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సురతాని మల్లారెడ్డి భాగ్యలక్ష్మి ల కుమారుడు అరవింద్ రెడ్డి తన ప్రతిభతో గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.
ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్షలో విజయం సాధించిన అరవింద్, తాజాగా ప్రకటించిన గ్రూప్ 3 ఫలితాలలో రాష్ట్ర స్థాయి 103వ ర్యాంక్‌ను పొందాడు.
అరవింద్ రెడ్డి సాధించిన ఈ విజయాలు గ్రామ యువతకు ప్రేరణగా నిలుస్తాయి.ఆలూరు గ్రామానికి చెందిన ఆయన,తన కృషి, పట్టుదలతో ఈ ఫలితాలను సాధించి, గ్రామం మరియు కుటుంబానికి గౌరవాన్ని తీసుకువచ్చారు.
అరవింద్ రెడ్డి సాధించిన ఈ విజయాలు గ్రామ యువతకు ప్రేరణగా నిలుస్తాయి.
ఈ సందర్భంగా సురతాని అరవిందును పలువురు విద్యావేత్తలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
Comments