Jagityala :మూల మలుపు వద్ద పొంచి ఉన్న ప్రమాదం.

Rathnakar Darshanala
మూల మలుపు వద్ద పొంచి ఉన్న ప్రమాదం.
-కల్వర్టుకు ఒకవైపు రక్షణ గోడ లేదు.

నేటివార్త ఫిబ్రవరి 2 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట-మూటపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. 

కల్వర్టుకు ఒకవైపు గోడ ఉండి,మరోవైపు గోడ లేకపోవడం వల్ల ప్రజలు ఈ ప్రాంతంలో రక్షణ గోడను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. 

రానున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉండటంతో,ప్రమాదాల నివారణకు గోడ నిర్మాణం అవసరమని వారు కోరుతున్నారు.

Pఅధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి,భక్తుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Comments