ఫిబ్రవరి 5న దేశవ్యాప్త నిరసన జయప్రదం చేయండి
By
Rathnakar Darshanala
ఫిబ్రవరి 5న దేశవ్యాప్త నిరసన జయప్రదం చేయండి.
నేటి వార్త ఫిబ్రవరి 02 పెద్దపల్లి ప్రతినిధి ఆడిచర్ల రమేష్.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న దేశ వ్యాప్తంగా నిరసనలు జయప్రదం చేయాలని,
ఆదివారం స్థానిక సిఐటియు ఆఫీసులో జరిగిన కార్మిక,రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్ణయించింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి అనేక కొత్త చట్టాలు తీసుకొస్తుందని,
వీటిని వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5న నిరసనకు పిలుపునిచ్చాయని,
ఇందులో జిల్లాలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కేంద్రం ప్రభుత్వం నిర్ణయించాలని, 2022 లో జరిగిన రైతాంగ పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని,
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని, పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఇవ్వాలని,
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువులను ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న జిల్లా, పట్టణ,
మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్, వివిధ సంఘాల నాయకులు కడారి తిరుపతి, పోచం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments