అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య.

Rathnakar Darshanala
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య.
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న యువ రైతు మృతదేహాలకు నివాళులర్పించిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్  మరియు మాజీ మంత్రి జోగు రామన్న.

 *తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువ రైతు రాకేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు శనివారం అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడ్డారు.

ఒకవైపు రుణమాఫీ కాకపోవడం రైతుబంధు అందకపోవడంపై మనస్తాపం చెంది తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో గల వారి పొలానికి వెళ్లి కుటుంబం అంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న సంఘటన  ఒక్కసారిగా  కలకలం రేపింది.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్  మాజీ మంత్రి జోగు రామన్న తో కలిసి హుటాహుటిన ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో గల వారి మృతదేహాలను పరిశీలించారు.

 అనంతరం రైతులను కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయని  అన్నారు.
Comments