కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి. జితేందర్ ఐపీఎస్.

Rathnakar Darshanala
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డిజిపి. జితేందర్ ఐపీఎస్.
  
నేటి వార్త మల్యాల ప్రతి నిధి.
దొనకొండ రమేష్.

  డీజీపీ గారికి ఆలయ సాంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 

ఆలయ అర్చకులు వేదొక్త మంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని డిజిపి కి అందజేసినారు. 
   కొండగట్టుకు విచ్చేసిన డిజిపి,

  ముందుగా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు తర్వాత సాయుధ బలగాలచే గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం డిజిపి జిల్లా యొక్క స్థితిగతులు, శాంతిభద్రతల గురించి జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న చర్యల గురించి ఎస్పీ  అడిగి తెలుసుకున్నారు.

 వీరి వెంట జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  ఐపీఎస్, డీఎస్పీ రఘు చందన్ ,ఆర్ఐ కిరణ్ కుమార్ ,మల్యాల, సీఐ నీలం రవి,ఎస్సైలు సతీష్, రవికుమార్ ఉన్నారు.
Comments