Jagityala :ప్రగతిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
By
Rathnakar Darshanala
ప్రగతిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
నేటివార్త జనవరి 26 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:
రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు.
విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలాపనలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ..ఈ వేడుకలు విద్యార్థుల్లో దేశభక్తి, సమాఖ్య స్పూర్తిని పెంపొందించడంలో సహాయపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు చిలివేరి ఆశన్న, కరస్పాండెంట్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments