Hyderabad :రేపటి నుండి ప్రభుత్వ పథకాలకు శ్రీకారం. రాష్ట్ర క్యాబినేట్ కీలక నిర్ణయం.

Rathnakar Darshanala
రేపటి నుండి ప్రభుత్వ పథకాలకు శ్రీకారం. రాష్ట్ర క్యాబినేట్ కీలక నిర్ణయం.
      సీఎం తో మంత్రివర్గం సమావేశం దృశ్యం.

హైదరాబాద్ నేటి వార్త  :

గణతంత్ర దినోత్సవ శుభదినం జనవరి 26న ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, 

ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

నాలుగు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. 

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  సీఎం గారితో సమీక్షా సమావేశం తర్వాత మంత్రులు మీడియాకు ముఖ్యాంశాలు వెల్లడించారు.

జనవరి 26న రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూటికి నూరు శాతం అమలు చేయడం ద్వారా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.

 కొత్తగా లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున జనవరి 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
Comments