Adilabad :2k రన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ.

Rathnakar Darshanala
2k రన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా శనివారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద నుండి ఆర్టిఏ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్ల పరుగును ఏర్పాటు చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని 2k రన్ ను ప్రారంభించడం జరిగింది.

 స్వయంగా జిల్లా ఎస్పీ రెండు కిలోమీటర్ల పరుగులో పాల్గొని యువతను ఉత్సాహపరిచి పరుగును విజయవంతం చేశారు. 

మొదటగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలయాలపై అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని, 

మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలియజేశారు.
Comments