యునాని వైద్యశాల ఉన్నా..... లేనట్లే..?
By
Rathnakar Darshanala
యునాని వైద్యశాల ఉన్నా..... లేనట్లే..?
*ఇన్చార్జి డాక్టర్ వైద్యశాలకు వచ్చిన దాఖలు లేవు....*
*తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు...*
**శిరివెళ్ల ::*( నేటి వార్త)
మండల కేంద్రంలోని యునాని వైద్యశాల ఉన్న లేనట్లు అన్న చందంగా మారింది. ఇక్కడ పని చేసే డాక్టర్ వేరే చోటికి బదిలీ కావడంతో ఇక్కడ చాలా కాలం నుండి ఇన్చార్జి పాలన కొనసాగుతుంది.
దీంతో రోగులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యునాని వైద్యశాలను ఏర్పాటు చేశారు. డాక్టర్, కాంపౌండర్, అటెండర్ ను కూడా ఈ వైద్యశాలకు ఏర్పాటు చేశారు.
అయితే రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో వేరే వైద్యశాల డాక్టర్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ శిరివెళ్ల యునాన్ని వైద్యశాలకు వచ్చిన దాకలే లేవు.. అటెండర్ ఒకరే అందుబాటులో ఉండడంతో డాక్టర్ లేరని అటెండరే అన్ని రోగులకు మందులు ఇస్తున్నారు.
ఈ ప్రాంత ప్రజలు యునాని వైద్యానికి అలవాటు పడటంతో ఈ వైద్యానికి ఆదరణ కూడా పెరిగింది. అప్పట్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదొక్కటే ప్రభుత్వ వైద్యశాలగా ఉండేది ప్రతి రోజు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందేవారు.
మోకాళ్లు నొప్పులు, చర్మ వ్యాధులు, సోరియాసిస్, కీళ్ల నొప్పులు ,షుగరు తదితర వ్యాధులకు మందులు ఉండేవి ఇప్పుడు వైద్యశాలకు రోగులు వెళితే ఒక్క మందు కూడా వైద్యశాలలో లేవంటున్న అటెండర్.
ఆస్పత్రిలో ఇన్చార్జి పాలన ఉండడంతో యునాని వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితమైన యునాని వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
*డాక్టర్ దివ్య వివరణ*
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓ గదిలో యునాని వైద్యశాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ మాత్రం ప్రస్తుతానికి రెగ్యులర్ డాక్టర్ ఇక్కడ లేరు. ఆ గదిలోనే మందులు కూడా మందులు ఉంచుకుంటున్నారు. ప్రస్తుతానికి ఒక అటెండర్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు.
Comments