పూలే దంపతుల సేవలు చిరస్మరణీయం.ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Rathnakar Darshanala
పూలే దంపతుల సేవలు చిరస్మరణీయం.ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

*ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్*

         నేటివార్త జగిత్యాల బ్యూరో జనవరి 25 : 

అంటరాని తనం నిర్మూలన కు బడుగు,బలహీన వర్గాల హక్కుల సాధనకు మహిలొద్దరణకు,

విద్యను అందించేందుకు పూలే దంపతులు కృషి చిరస్మరణీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని పూలే పార్కులో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేయించి కులాల అభివృద్ధికి బాటలు వేసిందని,

 సావిత్రీబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా జరుపాలని ఉత్తర్వులు జారీచేశారన్నారు. 

మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ పూలే దంపతులు చేసిన పోరాటం చూపించిన తెగువ స్ఫూర్తి దాయకమన్నారు. 

టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పూలే దంపతుల,వివేకానంద,పలు  విగ్రహాల, దాత అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఆదర్శ ఎమ్మెల్యే గా కొనియాడారు.

 జగిత్యాల నియోజకవర్గంలో  ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను  వివరిస్తూ,పూలే దంపతుల స్పూర్తితో బీసీ,ఎస్సీ,ఎస్టీ ,మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని బీసీ సంఘాల ప్రతినిధులతో  ప్రతిజ్ఞ చేయించారు. 

జిల్లా కేంద్రంలో నేతాజీ,భారత మాత,సర్వేపల్లి రాధా కృష్ణ  విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ వొద్ధి శ్రీలత,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, 

టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానాల కిషన్,రాష్ట్ర కార్యదర్శులు ముసిపట్ల లక్ష్మీ నారాయణ,బండారి  విజయ్, నాయకులు బి.నరేశ్,కొక్కు గంగాధర్,కస్తూరి శ్రీమంజరి

,గంగం జలజ,మున్సిపల్ కౌన్సిలర్లు ,ఉద్యోగ,ఉపాధ్యాయ,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments