ఓటు హక్కు మన అందరి హక్కు.
By
Rathnakar Darshanala
ఓటు హక్కు మన అందరి హక్కు.
నేటివార్త,జనవరి 25, తాండూర్:
తాండూర్ మండలంలో శనివారం రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.వివిధ పాఠశాలల విద్యార్థులు,
ఉపాధ్యాయులు, అధ్యాపకులు,అధికారులు, నాయకులు,పాల్గొని తాసిల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ తీశారు.అనంతరం ఐబి చౌరస్తాలో ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా తాండూర్ తాసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండి ఈసా,మాజీ ఎంపిటిసి సిరంగి శంకర్,మండల విద్యాధికారి మల్లేశం డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ విద్యా భారతి,
హై స్కూల్ డైరెక్టర్ సురభి శరత్ కుమార్,కస్తూర్బా ఎస్ఓ కవిత పలు పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు...
Comments