ప్రభుత్వ ఉద్యోగం సాధించిన చందోళి యువతి.

Rathnakar Darshanala
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన చందోళి యువతి.
నేటివార్త జగిత్యాల బ్యూరో జనవరి 25 : 

 జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి గ్రామానికి చెందిన  అంకతి ప్రియాంక నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నిషియల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైంది. 

గ్రామానికి చెందిన మల్లేశం మల్లేశ్వరిల దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రియాంక  బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది.

 ఇటీవల విడుదలైన ప్రభుత్వ ఉద్యోగల ఫలితాలలో ప్రియాంక ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 ప్రియాంకకు పలువురు బంధుమిత్రులు సహచర స్నేహితులు అభినందనలు తెలిపారు.
Comments