తిరు మారని జిన్నింగ్ మిల్స్...

Rathnakar Darshanala
తిరు మారని జిన్నింగ్ మిల్స్...
- పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు.

- వ్యవసాయ శాఖ అధికారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం ఉంటేనే కొనుగోళ్ళు.

- దళారుల కొమ్ము కాస్తున్న సీసీఐ అధికారులు జన్నింగ్ మిల్ యజమానులు.

నేటివార్త, జనవరి 21, బెల్లంపల్లి:
పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు పడుతున్నాడు తాండూర్ మండలం రేపల్లివాడ పత్తి మిల్లు వద్ద  రైతులను మిల్లు యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంగళవారం  రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు.

 ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీసీఐ ద్వారా మద్దతు ధర వస్తుందని వెళ్తే  దళారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా నిబందనలు మారుస్తూ ఇబ్బంది పెడుతున్నారని, 

ఒక్కరైతు దగ్గర 40 క్వింటలకన్న ఎక్కువ కొనమని అదికూడ వ్యవసాయ అధికారి సంతకముతో పాటు రెవెన్యూ ఐన్స్పెక్టర్ ఆర్ఐ సంతకం ఉంటేనే కొంటామని పత్తి అమ్ముకోవడానికి అద్దెకు వాహనాలు 

తీసుకొని వెలితే పత్తి కొనకుండా తమ వాహనాలను ఒక్కటి రెండు రోజులు పక్కన పెట్టేసి దళారుల వాహనాలను ముందుకు పంపి ఒక్కొక్కరికి రోజు రెండు ట్రిప్పుల అవకాశం ఇస్తున్నట్లు రైతులు బాధపడుతున్నారు.

 ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నామని సంబంధిత అధికారులకు చెబుదామంటే ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఫోన్ కాల్స్ కూడా లేపడం లేదని చెప్పారు. 

జిన్నింగ్ మిల్లు యజమానిని నిలదీయగా మా ఇష్టం మాకు సంబంధించిన వాహనాలకు ముందు అనుమతిస్తాం అవి అయిపోయాయక వేరేవారికి అవకాశం ఇస్తాం అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని రైతన్నలు వాపోతున్నారు.
Comments