అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు - ఆర్డీవో.

Rathnakar Darshanala
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు - ఆర్డీవో 
నేటివార్త,జనవరి 21, తాండూర్ :

తాండూర్ మండలంలోని నీలయపల్లి,మాదారం,మాదారం త్రీ,నర్సాపూర్,బోయపల్లి, కిష్టంపేట,చౌటపల్లి,కాసిపేట, ద్వారకాపూర్,

గ్రామపంచాయతీ కార్యాలయాలలో మంగళవారం రోజున.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుభరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,

కొత్త రేషన్‌ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించి నాయకులతో కలిసి సంబంధిత అధికారులు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు.

నర్సాపూర్ గ్రామసభలో ఆర్డిఓ హరికృష్ణ పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ పథకాల లిస్టులో అర్హులైన వారి పేర్లు లేవని ఎవరు ఆందోళన చెందవదని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వస్తాయని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు పథకాలకు సంబంధించిన విధివిధానాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్,తాసిల్దార్ ఇమ్రాన్ ఖాన్,ప్రత్యేక అధికారి నరసింహరావు,ఆర్ఐ అంజనకుమార్ ఎఈవో వెంకటేష్,,

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ ఈసా,సిఐ కుమారస్వామి, ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య,కార్యదర్శులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు..
Comments