అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన ఐసీడీఎస్ సూపర్వైజర్.

Rathnakar Darshanala
అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన ఐసీడీఎస్ సూపర్వైజర్.

నేటివార్త,ఖానాపూర్,జనవరి 21: 

ఖానాపూర్ మండలంలోని బీర్నంది,కొలాంగూడ,ఎర్వచింతల్ పంచాయతీ పరిధిలోని చామన్పల్లి అంగన్వాడి కేంద్రాలను మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత సందర్శించారు.

ఆయా కేంద్రాల్లోని పిల్లల బరువులు,ఎత్తులను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ,

 అంగన్వాడి టీచర్లు తమ మొబైల్ లలో ఎన్హెచ్టీఎస్, పోషన్ టాకర్ల యాప్ లను అప్డేట్ చేసుకుని పిల్లలు,గర్భిణీ,బాలింతల వివరాలు,బరువులు,ఎత్తులు నమోదు చేయాలని సూచించారు.

యాప్ లో పిల్లల రోజువారీ ఫోటోను అప్లోడ్ చేసి,3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి కథలు,ఆటపాటలతో విద్యను నేర్పించాలని అన్నారు.

పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ఆయా కేంద్రాల ఆవరణలో కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

అంగన్వాడి కేంద్రాల్లో,ఆవరణలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.అంగన్వాడీ టీచర్లు జీ కవిత,శారద,వనిత,తదితరులు ఉన్నారు.
Comments