ప్రభుత్వ పాఠశాలకు ప్రింటర్ అందజేత.
By
Rathnakar Darshanala
ప్రభుత్వ పాఠశాలకు ప్రింటర్ అందజేత.
నేటి వార్త జనవరి 27 రాయికల్:
మండలంలోని వీరాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పూర్వ విద్యార్థులు) విజినరీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో 7వేల రూపాయలు విలువచేసే కలర్ ప్రింటర్ ను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు కు అందజేశారు.
ఈ సందర్భంగా విజినరీ యూత్ సభ్యులు మాట్లాడుతూ...పాఠశాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్టాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని,
మన గ్రామ విద్యార్థులను మన పాఠశాలలో చేర్పించి, చదివించాలని గ్రామస్తులను కోరారు.కాగా విజినరీ యూత్ సభ్యులను గ్రామస్తులు,
పలువురు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాద శేఖర్,అత్తినేని గంగరాజం,
దిండిగాల రాజేష్, ఉపాధ్యాయులు కన్నవేని మల్లారెడ్డి,హరికృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments