అసంపూర్తిగా బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం.
By
Rathnakar Darshanala
అసంపూర్తిగా బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం.
నేటివార్త ప్రతినిధి రాకం సుమన్ జనవరి 30 :
ఇల్లంతకుంట అనంతారం గ్రామాల మధ్య ఉన్న బిక్క వాగుపై నిర్మించిన బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా అక్కేం నాగరాజు మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో దాదాపు 3కోట్ల రూపాయకు పైగా అంచనాతో ప్రారంభించిన బిక్కవాగు నిర్మాణం,
అసంపూర్తిగా పనులు జరగడంతో ప్రజలు దానిపై నుండి రాకపోకలు కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
మొదటి నుండి బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగగా పనులు వేగవంతం చేయాలని గత ప్రభుత్వం పైన నిరసనలు,ధర్నాలు ద్వారా ఒత్తిడి తెచ్చి 90శాతం పూర్తి చేసేలా ఏబీవీపీ కృషి చేసిందని తెలిపారు.
ప్రస్తుత మానకొండూర్ శాసనసభ్యులు కావ్వంపల్లి సత్యనారాయణ 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే మేలుకొని మిగిలిన పనులను పూర్తి చేసి మండల ప్రజలకు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
బ్రిడ్జి నిర్మాణం 20 రోజుల్లో పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే కార్యక్రమాలను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comments