కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో గాంధీజీ వ‌ర్ధంతి వేడుక‌లు.

Rathnakar Darshanala
కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో గాంధీజీ వ‌ర్ధంతి వేడుక‌లు.
నేటి వార్త ఆదిలాబాద్ : గాంధీ చూపిన బాట‌లో న‌డుస్తూ ఆయన ఆశ‌యాల‌ను కొన‌సాగించాల‌ని, ఆ మహాత్ముడిని ప్ర‌తిఒక్క‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు న‌గేష్‌, సీనియ‌ర్ నాయ‌కులు గిమ్మ సంతోష్ అన్నారు. 

ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌జాసేవా భ‌వ‌న్‌, క్యాంపు ఆఫీస్‌లో గాంధీ వ‌ర్ధంతి వేడుక‌ల‌ను గురువారం ఘ‌నంగా నిర్వ‌హించారు.

గాంధీ చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించి ఘ‌న‌మైన నివాళ్ల‌ర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయ‌న కృషిని కొనియాడారు. అహింస మార్గంలో ఆనాడు స్వాతంత్రం సాధించి పెట్టిన మ‌హానీయుడ‌ని కొనియాడారు. 

స‌త్యం, అహింసా సిద్ధాంతాల ద్వార  ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించార‌న్నారు. గాంధీజీ క‌ల‌లుక‌న్న గ్రామ స్వ‌రాజ్యం సాధ‌న‌కు ప్ర‌తిఒక్క‌రూ న‌డుం బిగించాల‌ని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్,ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,

కౌన్సిలర్ దర్శనాల లక్ష్మణ్,నాయకులు ఎం.ఏ షకీల్,బూర్ల శంకరయ్య,కొండూరి రవి,అల్చెట్టి నాగన్న,పత్తి ముజ్జు,షేక్ మన్సూర్,ఇజ్జగిరి సంజయ్ కుమార్,మంచాల మల్లయ్య,సార్ల సత్యనారాయణ,సాహెబ్రావు,మానే శంకర్,అతిక్ 

రహమాన్,అంజద్ ఖాన్,రాహుల్,మోహిన్,సిరాజ్,అశోక్,గంగన్న, నరిగి ఆశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments