అర్హులకే ప్రభుత్వ పథకాలు అందించాలని నిరసన.
By
Rathnakar Darshanala
అర్హులకే ప్రభుత్వ పథకాలు అందించాలని నిరసన.
*నేటివార్త జనవరి 30 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి*
కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డులు,
రైతు భరోసా మరియు రైతు ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారుల జాబితాలు విడుదల చేశారు. అయితే అందులో చాలా వరకు నిజమైన అర్హుల పేర్లు లేకపోవడంతో,
రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన మండల
బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కంటే గంగారం ఆధ్వర్యంలో కొందరు అర్హులైన గ్రామస్తులు రాయికల్ ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి,
నిజమైన అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపచేయలని, మండలంలోని మిగితా గ్రామాలలో నిజమైన అర్హులకే పథకాలు అందేలా చూడలని మండల ఎంపిడిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కి మండల
బిఆర్ఎస్ పార్టీ పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ ,ప్రధాన కార్యాదర్శి రత్నాకర్ రావు,జిల్లా,
నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొల్లూరి వేణు,మండల మైనార్టీ అధ్యక్షుడు చాంద్ పాషా, నాయకులు కోల కుమార్ , బట్టు నిశాంత్,అరుణ్ , అడిగేపి గంగారాం,శ్రీనివాస్, కునారపు మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments