రక్తదానం చేసి మానవత్వం చాటిన యువకులు.
By
Rathnakar Darshanala
రక్తదానం చేసి మానవత్వం చాటిన యువకులు.
నేటి వార్త జనవరి 30 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన కంచరి రాజేశం గుండె ఆపరేషన్ కోసం అత్యవసరంగా రక్తం అవసరమైన పరిస్థితిలో,
రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన యువకులు మెక్కొండ రాంరెడ్డి,సురతాని మల్లారెడ్డి,ఆకుల లక్ష్మీనారాయణ,పెద్దిరెడ్డి మల్లారెడ్డి, సోమిరెడ్డి మధుసూదన్,పూరేళ్ళ శివానందం సకాలంలో స్పందించి రక్తదానం చేశారు.
వీరందరి సహాయంతో అవసరమైన రక్తాన్ని సమకూర్చి,రాజేశం ఆపరేషన్‌కు మద్దతునందించగలిగారు.
వారి సాయాన్ని కుటుంబసభ్యులు, బంధువులు ప్రశంసించారు. సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఈ యువకులు మానవత్వం చాటారని స్థానికులు కొనియాడారు.
Comments