ఖమ్మం డిసిసి కార్యాలయంలో గాంధీ వర్థంతి వేడుకలు.

Rathnakar Darshanala
ఖమ్మం డిసిసి కార్యాలయంలో గాంధీ వర్థంతి వేడుకలు.
--నివాళులర్పించిన డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్

నేటి వార్త ఖమ్మం బ్యూరో జనవరి:30

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో గురువారం జాతి పిత మహత్మా గాంధీ 77 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.  

జిల్లా కాంగ్రెస్  అధ్యక్షులు  పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ 
 నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ జిల్లా ఐఎన్ టి యుసి  అద్యక్షులు కొత్తా సీతారాములు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ  చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినారు.

 అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ లు మాట్లాడుతూ..

గాంధీ సిద్ధాంతం నేటికీ స్ఫూర్తి దాయకం అని అన్నారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. 

ప్రజలు అతన్ని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ సత్యాగ్రహము అతని ఆయుధాలు. 

కొల్లాయి కట్టి చేతి కర్రబట్టి నూలు వడకి మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ కులాలూ ఒకటే అని చాటి చెప్పింది మహాత్మ గాంధీ అని కొనియాడారు. 

అనంతరం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు చాగంటి కృష్ణమూర్తి వందేమాతర గీతం ఆలపించారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు టీపీసీసీ సభ్యులు పుచ్చకాయల వీరభద్రం రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు వడ్డేబోయిన నరసింహరావు రాష్ట్ర 

మైనారిటీ నాయకులు బి యచ్ రబ్బానీ జిల్లా  మహిళా కిసాన్ మైనారిటీ అద్యక్షులు  దొబ్బల సౌజన్య మొక్క శేఖర్ గౌడ్ సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొడ్డా అశోక్ మద్దినేని రమేష్,

 నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు లకావత్ సైదులు నాయక్ మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు నగర ఓబీసీ మైనారిటీ అద్యక్షులు బాణాల లక్ష్మణ్ షేక్ అబ్బాస్ భేగ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల అంజనీ కుమార్ జిల్లా,

 ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ గజ్జి సూర్యనారాయణ జిల్లా ఐ ఎన్ టి యు సి  వర్కింగ్ ప్రెసిడెంట్ MD పాషా వాసిం భాయ్ రజి భాయ్ మహమూద్ సంపటం నరసింహరావు భూక్యా సురేష్ నాయక్ చల్లా ప్రతిభారెడ్డి బలుసు లక్ష్మి ఊరకొండ,

 చంద్రిక కొత్తపల్లి పుష్ప గడ్డం వెంకటయ్య నుకారపు వేంకటేశ్వరరావు తూములూరి లక్ష్మీనరసింహారావు పాషా బచ్చలికూర నాగరాజు బండి నాగేశ్వరరావు పేరం యశ్వంత్ ముజాహిద్ ఇబ్రహీం పాషా కిలారి వెంకటరమణ ఏలూరి రవికుమార్ సుగుణ తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments