రాష్ట్ర డిజిపి గా హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర ప్రభుత్వం. నియామకం.

Rathnakar Darshanala
రాష్ట్ర డిజిపి గా హరీష్ కుమార్ గుప్తా 
 రాష్ట్ర ప్రభుత్వం. నియామకం.
ఫిబ్రవరి 1వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించనున్న హరీష్ కుమార్ గుప్తా...

ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ  గా సేవలు అందిస్తున్నారు. 

 నేటి వార్త జనవరి 30 స్టేట్ బ్యూరో : 

 ఏపీ రాష్ట్ర డిజిపిగా హరీష్ కుమార్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది  ఈయన  1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్‌ గుప్తాను గత ఎన్నికల ముందు డీజీగా ఎన్నికల సంఘం నియమించింది. 

అయితే ఈ నెల 31న డీజీపీ ద్వారకా తిరుమలరావుపదవీకాలంముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హరీష్‌కుమార్‌ గుప్తాను నియమిస్తూప్రభుత్వంనిర్ణయించింది.

 అయితే ఏపీ కొత్త డీజీపీ ఎంపికపై అభ్యంతరం వ్యక్తమైంది. 

డీజీపీఎంపికవిషయంలోసుప్రీంకోర్టుఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని పిటిషన్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. 

డీజీపీ ఎంపిక విషయంలో యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. రూల్స్ మేరకు అన్ని అర్హతలున్న సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్టును ప్రభుత్వం యూపీఎస్సీకి రిఫర్ చేయలేదని తెలిపారు.

 ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపినా వారిలో ఎవరికి కూడా ప్రభుత్వంఅవకాశంఇవ్వడంలేదని తెలిపారు. 

అంతేకాకుండా జూనియర్లకుప్రాధాన్యతమిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే పిటిషనర్ తరపున వాదనలు విన్న ధర్మాసనం.. డీజీపీ ఎంపికపైఅభ్యంతరాలుంటే సుప్రీంకోర్టు వెళ్లాలనిసూచించింది. 

అలాగే పిటిషనర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. డీజీపీ ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ధర్మాసనం తీర్పుతో తెరపడింది.

దీంతో ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించింది.తాజాగాఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 

డీజీపీగాబాధ్యతలుస్వీకరించనున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డిజిపిగా హరీష్ కుమార్ గుప్తాను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నో కొత్తగా ఎంపికైన నరేష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments